*💐LIC ప్రీమియంని మీ మొబైల్ నుంచి సులభముగా పే చేయడం కోసం ఆఫీషియల్ యాప్...* *LIC Pay Direct Premium or Loan amount Android App-OFFICIAL ANDROID APP FROM LIFE INSURANCE CORPORATION OF INDIA* 👇 https://play.google.com/store/apps/details?id=com.lic.licpaydirect 💐💐💐💐💐💐💐💐💐💐💐


*💐CPS రిజిస్ట్రేషన్* *ఫారాలు* ⏯CSRF1: చందాదారుని రిజిస్ట్రేషన్ @ annexure11: అడిషనల్ రిక్వెస్ట్ వివరాలు @ annexure111: అడిషనల్ నామినేషన్ వివరాలు ⏯form S1: చందాదారుని దరఖాస్తు @ form S5: చందాదారుని రిజిస్ట్రేషన్ కోసం ddo కవరింగ్ లెటర్ ⏯form S6: చందాదారుని రిజిస్ట్రేషన్ కోసం dto కవరింగ్ లెటర్. 🆖form N3: ddo రిజిస్ట్రేషన్ కోసం ⏯form N4: ddo రిజిస్ట్రేషన్ కోసం dto కవరింగ్ లెటర్ @ form S2: చందాదారుని వివరాలు మార్పు ⏯form S7: చందాదారుని ఫోటో మరియు సంతకం మార్పు @ form S8: చందాదారుని ఫోటో మరియు సంతకం మార్పు కై ddo కవరింగ్ లెటర్ @ annexure G1: చందాదారుని ఫిర్యాదు దరఖాస్తు ⏯form 101 GS: రిటైర్మెంట్ తర్వాత దరఖాస్తు @ form 102 GP: రిటైర్మెంట్ ముందు దరఖాస్తు ⏯form 103 GD: ఉద్యోగి మరణించిన సందర్భంలో. 💐💐💐💐💐💐💐💐💐💐💐


*పథకం పేరు* : ఆయుష్మాన్ భారత్ *ప్రారంభ తేది* : ఆగస్ట్ 15, 2018 *లాభాలు* : ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో *5లక్షల రూపాయిల వరకు ఇంటిల్లపాది ఉచితం గా వైద్యం చేయించుకోవచ్చు*. దీనికి ఆన్లైన్ లో ధరఖాస్తు పూర్తి చేసి వారి పేరుని నమోదు చేసుకోవాలి. మరియు *సంవత్సరానికి కేవలం రు.1324/- చెల్లిస్తే సరిపోతుంది.* ప్రతి ఏడాది రు.5లక్షలు చికిత్స కొరకు పొందుతారు. Starts from 25th September https://www.abnhpm.gov.in


*💐CCE Marks Entry for Classes I to X for Academic Uear 2018-19 Rc.No:251 Dt:1.8.18* *🔸Instructions🔹* # 1 to 5 & 1to 8 Classes Online చేయాలిసిన బాధ్యత- MEO # 6 to 10 Online చేయాలిసిన బాధ్యత- HS HM #1 to 5 SA లు Online చేస్తే చాలు ,FA లు ఆవసరం లేదు #6 to 10 SA and FA లు Online చేయాలి *#2019-20 విద్యా సంవత్సరం నుండి 1 to 5 FA లు కూడా Online చేయాలి.☝* 💐💐💐💐💐💐💐💐💐💐💐


*Exact 25.676% DA Arrears Table as per Treasury DA Table* *మీ నెలవారీ ఇంక్రిమెంట్లు, అప్రయత్న పదోన్నతి ఇంక్రిమెంట్లు AAS, సంపాదిత సెలవులు Surrender Leaves కుడా కరువు బత్యం లో గణించబడును. మీ వ్యక్తిగత కరువుబత్యం కొరకు ప్రత్యేకం గా సాఫ్ట్ వేర్ తయారుచేయడమైనది. కింది క్లిక్ చేసి మీ కరువుబత్యం ను ట్రెజరీ లో వచ్చే విదంగా ఖచ్చితంగా పొందవచ్చు. PDF డౌన్లోడ్ కుడా చేసుకోవచ్చు* Share this Link to Your Friends... http://tg.apteachers.in/da/july2017.php


*దృష్టి వికలాంగ ఉపాధ్యాయుల రీడర్ భత్యం పెంపు ఉత్తర్వులు GO 24 విడుదల. డిసెంబర్ 2015 నుండి వర్తింపు* http://www.apteachers.in/2018/08/reader-allowance-enhanced-to-visually.html


కూచిపూడి నృత్య శిక్షణ కొరకు శిక్షకుల నియామకం:: రాష్ట్రం లోని జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాటశాల లు, కే.జి.బి.వి, మోడల్ స్కూల్స్ లో విద్యార్థుల కు కూచిపూడి నాట్యం నేర్పుటకు భాష, సాంస్కృతిక శాఖ 198 మంది శిక్షకుల ను నియమించింది. వీరికి నెలకు రూ.12,000/- గౌరవ వేతనం  చెల్లించ నుంది. ప్రతి సిక్షకునికి కి 5 పాటశాల ల చొప్పున కేటాయించనున్నారు. Andhra Pradesh Education News only.Install at https://play.google.com/store/apps/details?id=com.app.ednews


🅰🅿 ★ ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు ఎయిడెడ్ పాఠశాలల నందు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న షెడ్యూల్డ్ కులములకు చెందిన 2018-19 విద్యా సంవత్సరమునకు విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్పులు దరఖాస్తు చేసుకొనుటకు ప్రభుత్వం *"జ్ఞానభూమి"* https://jnanabhumi.ap.gov.in వెబ్ సైట్ నందు (Pre Matric Registration Form 2018-19) అనుమతించడమైనది. ★ దరఖాస్తు చేసుకొనుటకు రేషన్ కార్డు నెంబర్ తప్పనిసరి మరియు మీ సేవ ద్వారా జారీ చేయబడైన ఆదాయ, కుల, ఆధార్ కార్డు, విద్యార్ధి/విద్యార్ధిని యొక్క పాస్ పోర్ట్ సైజు ఫోటో మరియు విద్యార్థి/విద్యార్థిని బ్యాంకు ఖాతా ద్రువపత్రములను (బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ కాపీ పైన అకౌంట్ నెంబర్ పేస్ తో కాని స్కెచ్ తో కాని బోల్డ్ గా వ్రాసి) ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయవలెను. ★ మరియు పూర్తి చేసిన దరఖాస్తు ఫారములను "జ్ఞానభూమి" వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ ప్రింట్ కాపీని తీసుకొని పై తెలిపిన ఆదాయ, కుల, రేషన్ కార్డు, బ్యాంకు అకౌంట్ మరియు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను జతపరచి వారికి సంబంధించిన స్కూల్ ప్రధానోపాధ్యాయులకు సమర్పించవలెను. ★ సంబంధిత ప్రధానోపాధ్యాయులు తమరికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత వసతి గృహా అధికారులకు దరఖాస్తులు పంపవలెను.


*ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ ఎందుకివ్వాలి ??* ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి సర్వీసు లో ఉండగా కేవలం జీతం మీదే ఆధారపడి బ్రతకాలి . పదవిలో ఉండగా తాను గాని, కుటుంబ సభ్యులు కానీ ఏ విధమైన వ్యాపారాలు కానీ ఇతర డబ్బు సంపాదించే వ్యవహారాలు చేయకూడదు. ఆస్తులు సమకూర్చుకోకూడదు. 5,000 రూపాయల పైబడి వస్తువులను ,ఆస్తులను కొన్నా , ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఒక ఉద్యోగి తన జీవితంలో అనుకోని కారణాల వలన మరణించినా లేదా పదవీ విరమణ అనంతరం తనకు ,తన పైన ఆధారపడిన కుటుంబానికి సామాజిక ,ఆర్థిక భద్రత కొరకు ,వృద్దాప్యంలో సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అప్పటివరకు వచ్చిన జీతo ఆగిపోతుంది. *పెన్షన్ గురించి సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చింది ??* 1952 సం!!రం లో , సుప్రీంకోర్టు లో జరిగిన DS నటారా vs govt of india మధ్య జరిగిన పెన్షన్ కేసులో ఇలా తీర్పు ఇచ్చింది. భారతరాజ్యాంగంలోని ఆర్టికల్ 11, 14,16 ప్రకారం పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కని, మూడు దశాబ్దాలుపైగా ప్రభుత్వానికి సేవలు చేసిన ఉద్యోగికి ఇచ్చే విలువగా చూడాలని,అది ఉద్యోగికి ఇచ్చే కాంపెన్షషన్ కాదని ,ఉద్యోగికి ఆర్థికంగా సామాజికంగా భద్రతను కల్పించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని స్పష్టంగా చెప్పటం జరిగింది. *పాత పెన్షన్ విధానం స్థానంలో నూతన పెన్షన్ విధానo(CPS)ఎందుకు వచ్చింది. ???* భారతీయుల సగటు జీవితకాలం పెరిగినందున పెన్షనర్లకు పెన్షన్ చెల్లించడం కష్టమై ఆర్థిక వ్యవస్థపైభారం పడుతుందని పెన్షన్ విధానాన్ని సంస్కరించి ప్రైవేటీకరించాలని , అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారత ప్రభుత్వానికి (IMF) సూచించింది. దానికనుగుణంగా అప్పటి NDA ప్రభుత్వం, 2001-02 సంవత్సర౦ పెన్షన్ విధా నంలో మార్పు చేయడానికి బి.కె. భట్టాచార్య నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. కమిటీ ప్రతిపాదనలను తేదీ 23.08.2003 రోజున ఆమోదించారు, డిసెంబర్ 2003 లో PFRDA బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. *CPS ఎలావుంటుంది.??* నూతన పెన్షన్ ప్రకారం Basic,DA పైపది శాతం గా వాటా కట్చేసి అంతే మొత్తానికి సమానమైన వాటాను ప్రభుత్వం CPS ఖాతాలో నిధిగా జమ చేస్తుంది. ఈనిధిని షేర్ మార్కెట్ లో ఫండ్ మేనేజర్లు ద్వారా నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL )ద్వారా పెట్టుబడి పెడతారు. *NSDL నిర్వహణ-పనితీరు ఎలా ఉంది ??* మొదట్లో సిపిఎస్ ఖాతా నిర్వహణకుఉద్యోగి ట్రెజరీ ఐడీ పై నిధిని జమ చేసేవారు. కానీ 2009 తర్వాత సెంట్రల్ రికార్డింగ్ కీపింగ్ ఏజెన్సీ (CRA) మరియు NSDL రూపొందించిన పర్మినెంట్ రిటైర్మెంట్ ఎక్కౌంట్ నెంబర్ PRAN ప్రాన్ ఖాతాలోనిధిని జమ చేయటం జరుగుతుంది. *CPS ద్వారా జీతంలో కట్ చేసిన మొతాన్ని ఏంచేస్తారు ??* NSDL లో SBI కిచెందిన 15 రకాల,LIC కి చెందిన 10రకాలు,HDFC, ICICI, వంటి వివిధ రకాల మ్యూచవల్ ఫండ్స్ అందుబాటులో ఉంటాయి. ఉద్యోగి సర్వీసులో ఉన్నంత కాలం వసూలైన డబ్బును ప్రభుత్వం వివిధ రకాల మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతూదానిపై వచ్చే లాభనష్టాలు ఆధారంగా ఉద్యోగస్థులకు పింఛన్ ని నిర్ణయించడం జరుగుతుంది. *NSDLలోపాలు ఏమిటి ??* 1) దరఖాస్తు చేసిన వారికి PRAN కార్డ్ సకాలంలో రాకపోవటం 2) ఉద్యోగుల సంప్రదింపులకు అందుబాటులో లేకపోవటం 3) ఖాతాదారుల వివరాలను మార్పు చేయకపోవటం 4) ప్రభుత్వo,ఉద్యోగి యొక్క మ్యాచింగ్ గ్రాంట్ను నెల నెలా ఉద్యోగ ఖాతాలో సరిగా జమ చేయకపోవడం 5) ఖాతాలో జమ అయ్యే మొత్తంలో అధిక తేడాలు ఉండటం 6) తమ తమ ఖాతాలో నిధులు సరిగ్గా జమకావడం లేదని ఎన్నిసార్లుఫిర్యాదు చేసినా తిరిగిమళ్లీ జమ చేయలేకపోవడం 7) చనిపోయిన ఉద్యోగ కుటుంబాలకు వారి ఖాతాలో ఉన్న నిధిని సకాలంలో ఆదించలేకపోవడం 8) స్థానికంగా కార్యాలయాలు లేకపోవడం 9) దాదాపు 530కోట్ల రూ,ఉద్యోగుల సొమ్ము మాయం కావడం 10) సిపిఎస్ కార్యాలయాలు ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం లలో మాత్రమే ఉన్నాయి. *CPS విధానాన్ని రద్దు చేయాల్సింది రాష్ట్రమా ?? కేంద్రమా ??* CPS విధానాన్ని రద్దు చేయాల్సింది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వమే!! పాత పెన్షన్ అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని విధానంలో కొనసాగాలన్న స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర ఆర్థిక శాఖ ఏనాడో స్పష్టంగా చెప్పడం జరిగింది. పశ్చిమబెంగాల్ త్రిపుర రాష్ట్రాల్లో ఈ నాటికీ కూడా పాత పెన్షన్ విధానమే కొనసాగుతుంది. ప్రస్తుతం తమిళనాడు, కేరళ, ఇతర 4,5 రాష్ట్రాలు పాత పెన్షన్ విధాన పునరుద్ధరణకు కమిటీలు వేసి అధ్యయనం చేస్తున్నాయి *సిపిఎస్ విధానం లోని నష్టాలు ??* 1. ఉద్యోగి పెన్షన్ కు ప్రభుత్వం ఎటువంటి గ్యారంటీ కానీ హామీ గానీ బాధ్యత తీసుకోదు 2. ఉద్యోగి మూలవేతనం +కరువు భత్యం పై పది శాతం నగదు ను కత్తిరిస్తుంది. 3. షేర్ మార్కెట్ జూదంపై ఆధారపడటం. 4. గ్రాట్యూటీ లేదు. 5 . ఫ్యామిలీ పెన్షన్ లేదు. 6. పెన్షన్ నిధి పై పది శాతం పన్ను ఉంటుంది. 7. కమ్యుటేషన్ ప్రస్తావన లేదు (OPS లో40% కమ్యూటేషన్) . 8. విరమణ అనంతరం హెల్త్ కార్డ్ సదుపాయం లేదు . 9. అత్యవసర లోఆదుకునే GPF లొన్ వంటి సదుపాయం లేదు. 10. పదవీ విరమణ సమయంలో 60%పోను,మిగిలిన 40శాతం నిధిని మళ్లీ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఆ రోజు ఉన్న మార్కెట్ పై పెన్షన్ని నిర్ధారించడం,ఒకవేళ మార్కెట్లో నష్టాలు వస్తే పెన్షన్ అమాంతం పడిపోవడం. 11. (DA డీర్ నెస్ అలెవెన్స్ ) కరువు భత్యం సదుపాయం లేకపోవడం. 12. PRC లలో పెరుగుదల లేకపోవడం. 13. PFRDAచట్టంలో లోని సెక్షన్ 12, సబ్సెక్షన్ 4,5 ప్రకారం 2004సం,, కంటే ముందు ఉద్యోగంలో చేరిన వారి కి కూడా నూతన పెన్షన్ విధానాన్ని విస్తరించే ప్రమాదం పొంచి ఉండటం. 14. పాత పెన్షన్ విధానంలోఉద్యోగి మరణించిన ఒక్కరోజులోనే అతనికి సంబంధించిన అన్ని బెన్ఫిట్స్ క్లైమ్ ఆవుతయీ. కానీ సిపిఎస్ విధానం అసలు క్లైం చేసుకునే విధానం తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది వీటిపై ఉద్యోగస్తులకు కూడా పూర్తి అవగాహన లేదు.ఉద్యోగికి సంబంధించిన అన్ని బెన్ ఫిట్స్ రావడానికి దాదాపు2-3సంవత్సరాలు పడుతుంది. 15) ఖాతా నిర్వహణకు చార్జెస్ వర్తిస్తాయి.. పాత పెన్షన్ లో ఎటువంటి చార్జెస్ ఉండవు. *CPS పెన్షన్ చెల్లింపులు ఎలా ఉంటాయి. ??* 1) స్వచ్ఛంద పదవీ విరమణ సమయంలో... ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తంలో ఇరవై శాతం నిధిని చెల్లిస్తారు. మిగతాఎనభై శాతం ను నెలవారీ పెన్షన్గా ఇవ్వడానికి వివిధ రకాల పథకాలలో పెట్టుబడి పెడతారు. 2) సాధారణ పదవీ విరమణ సందర్భంలో... ఉద్యోగి సాధారణ పద విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తంలోఅరవై శాతం నిధిని చెల్లిస్తారు మిగతా నలభై శాతం లో వివిధ రకాలపథకాల్లో పెట్టుబడి పెట్టి పెన్షన్ అందజేస్తారు. 3) అకాల మరణం చెందినపుడు..... ఉద్యోగి ఖాతాలో ఉన్న 100% నామినీకి చెల్లిస్తారు.


*🌷విషయం :-* *ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే..* *02-08-2018 15:03:09* *అమరావతి:* నిరుద్యోగ భృతికి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12.26 లక్షల మందికి రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని కేబినెట్ ఆమోదించింది. ఈ నిరుద్యోగ భృతికి 'ముఖ్యమంత్రి యువనేస్తం' పేరు ఖరారు చేసింది. అంతేకాకుండా త్వరలో 20వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. డీఎస్సీతో పాటు ఇతర శాఖల్లో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. అలాగే ఉడాకు మెడ్‌టెక్‌ జోన్ చెల్లించాల్సిన రూ.11 కోట్ల పన్నుకు మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పేరును వైజాగ్ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీగా మార్పు చేశారు. వీఎమ్‌ఆర్‌డీ పరిధి 5573 చ.కి.మీ. నుంచి 6764.59 చ.కి.మీ వరకు పెంచారు. వీఎమ్‌ఆర్‌డీ పరిధిలో 48 మండలాలు, 1340 గ్రామాలు ఉండనున్నాయి. వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నూతన చేనేత విధానానికి ఆమోదం తెలిపారు. అలాగే ఫిజియోథెరపిస్టుల రాష్ట్ర కౌన్సిల్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగల్