*🌷విషయం :-* *ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే..* *02-08-2018 15:03:09* *అమరావతి:* నిరుద్యోగ భృతికి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12.26 లక్షల మందికి రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని కేబినెట్ ఆమోదించింది. ఈ నిరుద్యోగ భృతికి 'ముఖ్యమంత్రి యువనేస్తం' పేరు ఖరారు చేసింది. అంతేకాకుండా త్వరలో 20వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. డీఎస్సీతో పాటు ఇతర శాఖల్లో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. అలాగే ఉడాకు మెడ్‌టెక్‌ జోన్ చెల్లించాల్సిన రూ.11 కోట్ల పన్నుకు మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పేరును వైజాగ్ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీగా మార్పు చేశారు. వీఎమ్‌ఆర్‌డీ పరిధి 5573 చ.కి.మీ. నుంచి 6764.59 చ.కి.మీ వరకు పెంచారు. వీఎమ్‌ఆర్‌డీ పరిధిలో 48 మండలాలు, 1340 గ్రామాలు ఉండనున్నాయి. వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నూతన చేనేత విధానానికి ఆమోదం తెలిపారు. అలాగే ఫిజియోథెరపిస్టుల రాష్ట్ర కౌన్సిల్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగల్


No comments:

Post a Comment