🅰🅿 ★ ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు ఎయిడెడ్ పాఠశాలల నందు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న షెడ్యూల్డ్ కులములకు చెందిన 2018-19 విద్యా సంవత్సరమునకు విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్పులు దరఖాస్తు చేసుకొనుటకు ప్రభుత్వం *"జ్ఞానభూమి"* https://jnanabhumi.ap.gov.in వెబ్ సైట్ నందు (Pre Matric Registration Form 2018-19) అనుమతించడమైనది. ★ దరఖాస్తు చేసుకొనుటకు రేషన్ కార్డు నెంబర్ తప్పనిసరి మరియు మీ సేవ ద్వారా జారీ చేయబడైన ఆదాయ, కుల, ఆధార్ కార్డు, విద్యార్ధి/విద్యార్ధిని యొక్క పాస్ పోర్ట్ సైజు ఫోటో మరియు విద్యార్థి/విద్యార్థిని బ్యాంకు ఖాతా ద్రువపత్రములను (బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ కాపీ పైన అకౌంట్ నెంబర్ పేస్ తో కాని స్కెచ్ తో కాని బోల్డ్ గా వ్రాసి) ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయవలెను. ★ మరియు పూర్తి చేసిన దరఖాస్తు ఫారములను "జ్ఞానభూమి" వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ ప్రింట్ కాపీని తీసుకొని పై తెలిపిన ఆదాయ, కుల, రేషన్ కార్డు, బ్యాంకు అకౌంట్ మరియు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను జతపరచి వారికి సంబంధించిన స్కూల్ ప్రధానోపాధ్యాయులకు సమర్పించవలెను. ★ సంబంధిత ప్రధానోపాధ్యాయులు తమరికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత వసతి గృహా అధికారులకు దరఖాస్తులు పంపవలెను.


No comments:

Post a Comment