*✨ జ్ఞానధారకు నూతన మార్గదర్శకాలు* *6 నుంచి 8వ తరగతి విద్యార్థుల కొరకు ప్రణాళిక* *ఈ నెల 31న పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు* *🔅జ్ఞానధార మార్గదర్శకాలు ఇవే!* ★ జ్ఞానధార కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మూడు సబ్జెక్టులకు (తెలుగు, ఇంగ్లీష్‌, గణితం) సం బంధించి బేస్‌లైన్‌ బుక్‌లెట్‌ అందజేస్తారు. ప్రతి సబ్జెక్టును నాలుగు విభాగాలుగా విభజిస్తారు. ★ ప్రతి సబ్జెక్టుకు 30 మార్కుల వంతున మూడు సబ్జెక్టులు 90 మార్కులకు ఇస్తారు. బేస్‌లైన్‌ పరీక్షకు ప్రతిక్లాస్‌ టీచర్‌ అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తారు. ★ మూడు సబ్జెక్టులు పరీక్ష పూర్తి అయిన తరువాత ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయులు వాల్యూయేషన్‌ (మూల్యాంకనం) చేయాలి. ★మార్కులను ప్రశ్నపత్రంలో ఇచ్చిన టేబుల్‌లో నమోదుచేయాలి. ★ బేస్‌లైన్‌ టెస్టు ముగిసిన తరువాత మార్కులను డేటా ఎంట్రీ ద్వారా సెప్టెంబరు 5లోగా సీసీఈ పోర్టల్‌లో నమోదు చేయాలి. ★ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6వ నుంచి 9వ తరగతి విద్యార్థులను సబ్జెక్టుపరంగా పరిశీలించేందుకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నారు. ★ తెలుగు, ఇంగ్లిష్‌, గణితం సబ్జెక్టుల్లో ఇందు కోసం ప్రత్యేకంగా వర్కుబుక్స్‌ను విద్యార్థులకు అందజేసినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ★ తెలుగులో తప్పులు లేకుండా రాయడం, చదవడం, ఇంగ్లిష్‌లో స్పెల్లింగ్‌ తప్పులు లేకుండా పదాలు రాయడం, వారి క్లాసులకు సంబంఽధించిన పాఠ్యపుస్తకాలు చదివించడం, గ్రామర్‌ ఇతర అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు. ★ గణితానికి సంబంధించి కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, వారు చదివే గణిత పాఠ్యాంశాల్లోని లెక్కలు వచ్చా? లేదా? అనే విషయాలు పరిశీలించి మార్కులు వేస్తారు. ★ ఈ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు, పాఠశాల ఉపాధ్యాయులకు తగిన సూచనలు సలహాలు ఇస్తారు. ★ ఇలా పదో తరగతికి వచ్చేసరికి విద్యార్థులు సబెక్టుపరంగా నైపుణ్యం సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.


No comments:

Post a Comment