*✨ పాన్‌ కార్డు - కొత్త నిబంధనలు* ★ పాన్‌ కార్డులో వ్యక్తి పేరుతోపాటు అతని/ఆమె తండ్రి పేరు ఇక నుంచి తప్పనిసరి కాదు. ★ తండ్రి పేరుకు బదులు తల్లి పేరును కూడా పేర్కొనే అవకాశం. ★ అంటే, పాన్‌ దరఖాస్తుదారు కార్డు మీద తండ్రి పేరు ఉండాలా? తల్లి పేరు ఉండాలా? అనేది నిర్ణయించుకోవచ్చు. ★ ఒకవేళ ఒంటరి తల్లి ఉన్న సందర్భాల్లో తండ్రి పేరు పేర్కొనకుండా 'సింగిల్‌ మదర్‌' ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చు. ★ కొత్త దరఖాస్తు ఫారాలు ఆదాయపు పన్ను వెబ్‌సైటులో అందుబాటులోఉన్నాయి. ★ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,000 మించి లావాదేవీలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా పాన్‌ పేర్కొనాల్సిందే. ★ గతంలోనే దీనికి సంబంధించిన నిబంధనలు వచ్చినప్పటికీ.. పాన్‌ సమర్పణకు చివరి తేదీ ఎప్పుడన్నది పేర్కొనలేదు. ★ తాజాగా ఈ తేదీని వచ్చే ఆర్థిక సంవత్సరం మే 31గా ఆదాయపు పన్ను శాఖ నిర్ణయం. ★ అంటే.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.రెండున్నర లక్షల లావాదేవీ నిర్వహిస్తే.. మే 31, 2019లోగా పాన్‌ సమర్పించాల్సి ఉంటుంది. ★ వ్యక్తులుగా ఉన్నప్పటికీ.. సంస్థలకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, డైరెక్టర్‌, భాగస్వామి, ట్రస్టీ, వ్యవస్థాపకుడు, కర్త, ముఖ్య కార్య నిర్వహణాధికారి, ప్రిన్సిపల్‌ ఆఫీసర్‌ తదితర హోదాల్లో పనిచేస్తూ, వాటి తరఫున లావాదేవీలు నిర్వహించినప్పుడూ పాన్‌ పేర్కొనాలి.